తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

  • తమిళనాడులో ఉగ్రకలకలం
  • ఐసిస్ సానుభూతిపరులన్న అనుమానంతో సోదాలు
  • ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
కొంతకాలం కిందట తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ వారిచ్చిన సమాచారంతో ఇటీవల తరచుగా దాడులు నిర్వహిస్తోంది. తాజాగా, తమిళనాడులోని తంజావూరు, తిరుచిరాపల్లి ప్రాంతాల్లో ఐసిస్ సానుభూతిపరులన్న అనుమానంతో సోదాలు చేపట్టింది. ఐసిస్ తో సంబంధాలున్నాయన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. సోదాలు నిర్వహించిన సందర్భంగా ఇద్దరు అనుమానితుల నుంచి ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
Go Back to Shorts
Tamilnadu
NIA
laptops
Mobile Phones

More Telugu News